కాపాడేవా రాపాడేవా లిరిక్స్ – అర్జున ఫల్గుణ

Kaapadeva Raapadeva Lyrics: అర్జున ఫాల్గుణ చిత్రం నుండి చైతన్య ప్రసాద్ రచించిన కాపాడేవా రాపాడేవా సాంగ్ లిరిక్స్, మోహన భోగరాజు ఈ పాటని పాడారు, ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ స్వరాలు సమకూర్చారు.

కాపాడేవా రాపాడేవా లిరిక్స్ – అర్జున ఫల్గుణ

ఏదేమైనా కానీ రానీ లేరా పోరా
మీలా మీరే సాగి పోవాలే

కాపాడేవా రాపాడేవా వేటాడేవా
నువ్ మా తోడే కాలేవా దేవీ ఓ..

ఏ.. అమ్మోరిలో ధమ్మే నువ్వై
కత్తే పట్టుకుంటావో
మండుతున్న నిప్పురవ్వై
నువ్వే దూసుకొస్తావో

ఓ.. వచ్చేయ్ వచ్చేయ్
అర్జునుడల్లే వచ్చేయ్
కొట్టేయ్ కొట్టేయ్
ఫల్గునుడల్లే కొట్టేయ్

జంకావంటే మేకల్లే చంపేస్తారే
పంజా ఎత్తి సై అంటే జై అంటారే
పులే అవుతావో బలే అవుతావో
నువ్వే తేల్చాలి నడుంబిగించి

కాపాడేవా రాపాడేవా వేటాడేవా
నువ్ మా తోడే కాలేవా దేవీ ఓ..

హే.. ఇల్లే దాటి ఇట్టాగ వచ్చేసామే
కష్టాలన్నీ ఇష్టంగా మోస్తున్నామే
రేపెట్టుందో ఎటేపెల్తుందో
భయాలొగ్గేసి వచ్చాం తెగించి

అదిరా అదిరా రా అర్జునకై
అడ్డుతలక ఫాల్గుణకై రా..

Kaapadeva Raapadeva Lyrics

చిత్రం: అర్జున ఫల్గుణ
పాట: కాపాడేవా రాపాడేవా
సాహిత్యం: చైతన్య ప్రసాద్
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్
గాయకులు: మోహన భోగరాజు
లేబుల్: ఆదిత్య మ్యూజిక్.

Leave a Comment