ఈ రాతలే దోబూచులే లిరిక్స్ – రాధేశ్యామ్

Ee Raathale telugu Lyrics: ఈ రాతలే దోబూచులే సాంగ్ లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీషులో ఇక్కడ ఉన్నాయి. రాధే శ్యామ్ చిత్రంలోని పాటల సాహిత్యాన్ని కృష్ణకాంత్ రాశారు, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు మరియు హరిణి ఇవటూరి, యువన్ శంకర్ రాజా ఆలపించారు. రాధే శ్యామ్‌లో ప్రభాస్, పూజా హెగ్డే నటించారు.

ఈ రాతలే దోబూచులే లిరిక్స్ – రాధేశ్యామ్

ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా

వీరి దారొకటే మరి దిక్కులే వేరులే
ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల
ఆటాడే విదే ఇదా ఇదా
పదే పదే కలవడం ఎలా ఎలా కల
రాసే ఉందా రాసే ఉందా…

ఈ రాతలే దోబూచులే
ఈ రాతలే దోబూచులే

ఎవరో వీరెవరో
కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో
విడిపోని యాత్రికులా

ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో
నాతో ఏదో కథ చెప్పాలంటోందే

ఏ గూఢచారో గాఢంగా నన్నే
వెంటాడెను ఎందుకో ఏమో

కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే
గాయం లేదు గాని దాడెంతో నచ్చే

ఆ మాయే ఎవరే రాడా ఎదురే
తెలీకనే తహతహ పెరిగే
నిజమా భ్రమ బాగుంది యాతనే
కలతో కలో గడవని గురుతులే
ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే

ఈ రాతలే దోబూచులే
ఈ రాతలే దోబూచులే
ఈ రాతలే దోబూచులే

ఏ గూఢచారో గాఢంగా నన్నే
వెంటాడెను ఎందుకో ఏమో
ఆ మాయే ఎవరే రాడా ఎదురే
తెలీకనే తహతహ పెరిగే

ఎవరో వీరెవరో
కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో
విడిపోని యాత్రికులా

చిత్రం: రాధే శ్యామ్
పాట: ఈ రాతలే
సాహిత్యం: కృష్ణకాంత్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
గాయకులు: యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి
సంగీతం లేబుల్: టీ సిరీస్ తెలుగు.

Leave a Comment