ప్రియతమా నీవచట కుశలమా లిరిక్స్

Priyathama Neevachata Kusalama lyrics: ప్రియతమా నీవచట కుశలమా సాంగ్ లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీషులో ఇక్కడ ఉన్నాయి. గుణ చిత్రంలోని పాటల సాహిత్యాన్ని వక్కలంక లక్ష్మీపతి రావు గారు రాశారు, ఇళయరాజా గారు సంగీతం అందించారు మరియు ఎస్ పి బాలు గారు, ఎస్ పి శైలజ ఆలపించారు. గుణ చిత్రంలో కమల్ హాసన్, రోషిణి, రేఖ, ఎస్.వరలక్ష్మి నటించారు.

ప్రియతమా నీవచట కుశలమా లిరిక్స్

కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో

ఓహో…
కమ్మని ఈ ప్రేమ లేఖనే
రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే

గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమి గాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది

నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్చమైనది
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా

ఉమదేవిగా శివుని అర్దభాగమై
నాలోన నిలువుమా
శుభలాలి లాలి జో లాలి లాలి జో
ఉమాదేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా నా హృదయమా

Priyathama Neevachata Kusalama lyrics:

చిత్రం: గుణ
పాట: ప్రియతమా నీవచట కుశలమా
సాహిత్యం: వక్కలంక లక్ష్మీపతి రావు
సంగీతం: ఇళయరాజా
గాయకులు: ఎస్ పి బాలు గారు, ఎస్ పి శైలజ
లేబుల్: ఆదిత్య మ్యూజిక్.

Leave a Comment