సంక్రాంతి సందల్లే Sankranthi Sandhalle Song Telugu Lyrics – Sreekaram

Sankranthi Sandhalle Song Telugu Lyrics - Sreekaram
Sankranthi Sandhalle Song Telugu Lyrics - Sreekaram

Sankranthi Sandhalle Song Telugu Lyrics, sung by Anurag Kulkarni, Mohana Bhogaraju. Sankranthi Sandhalle Song Telugu Song Music of this song is composed by Mickey J Meyer and  Sankranthi Sandhalle Telugu lyrics penned by Sanapati Bharadwaj Patrudu. Starring Sharwanand, Priyanka Arul Mohan.  Sankranthi Sandhalle Song Telugu Lyrics are here.

Sankranthi Sandhalle Telugu Song Details

Song TitleSankranthi Sandhalle
SingerAnurag Kulkarni,Mohana Bhogaraju
LyricsSanapati Bharadwaj Patrudu
MusicMickey J Meyer
LabelSony Music South

Sankranthi Sandhalle Song Telugu Lyrics 

సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే

మన ఊరితో సమయాన్ని ఇలా గడిపేయడం ఒక సరదా రా
మనవారితో కలిసుండడం ఒక వరమేరా ఆ
నన్ను మరువని చూపులేనెన్నో
నన్ను నడిపిన దారులెనెన్నో
నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే

సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే

ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యిమంటూ కయ్యిమన్నా ఆడపిల్ల
ముక్కుమీద వచ్చే కోపం
భోగి మంట ముందు నిల్చోనుంది చల్లగాలి
ఒంటినే వెచ్చగా తాకుతోంది
తంబూరలతో చిడత పాడేనంటా
గంగిరెద్దులాటలో డోలు సన్నాయంటా
పెద్ద పండగొచ్చేనో అంటూ ముస్తాబు అయింది చూడరా ఊరు ఇచ్చట
ఇంటి గడప ఉంది స్వాగతించడానికి
వీధి అరుగు ఉంది మాట కలపడానికి
రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికి
మన ఊరితో సమయాన్ని ఇలా గడిపేయడం ఒక సరదా రా
మనవారితో కలిసుండడం ఒక వరమేరా ఓ…

దెబ్బలాటలోనా ఓడిపోతే కోడిపుంజు పొయ్యి మీద
కూరలాగా తాను మాయి పోదా పాపం
మేడ మీద నుండి గాలిపటం నింగి దాకా దారం తూగగా
ఎగురుతూ ఉంది ఎడ్లబండి పై ఎక్కి చిన్న పెద్దా
గోల గోల చేయడం ఎంత బాగుందంట
రోజు మారి పోయిన గాని తగ్గేది లేదంట
అంతటా సంబరాలే
విందు భోజనాలు చేసి రావటానికి
నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి
అంతమంది ఒక్కసారి కలవడానికి
చాలవంట మూడు రోజులు

మన ఊరితో సమయాన్ని ఇలా గడిపేయడం ఒక సరదా రా
మనవారితో కలిసుండడం ఒక వరమేరా
మన ఊరితో సమయాన్ని ఇలా గడిపేయడం ఒక సరదా రా
మనవారితో కలిసుండడం ఒక వరమేరా ఓ…

సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే

Related Songs:

Sankranthi Sandhalle Song Lyrics in English

This is a site to get the latest and evergreen popular Hit songs, lyrics were written in Telugu font from Movies and Private album-hit songs. Thanks for visiting us! ఇంకేంటి ఆలస్యం పాడటం స్టార్ట్ చెయ్యండి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here