నీ చూపులే సాంగ్ లిరిక్స్ – ఎందుకంటే…ప్రేమంట

nee choopule song lyrics in telugu: నీ చూపులే సాంగ్ లిరిక్స్ తెలుగులో ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే…ప్రేమంట చిత్రంలోని పాటల సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి గారు రాశారు, జీవీ ప్రకాష్ కుమార్ గారు సంగీతం అందించారు మరియు చిత్ర మరియు హరిచరణ్ ఆలపించారు. ఎందుకంటే…ప్రేమంటలో రామ్ పోతినేని, తమన్నా నటించారు.

నీ చూపులే సాంగ్ లిరిక్స్

నీ చూపులే నా ఊపిరీ..
ఓ సారిలా చూడే చెలీ
అమవాస్యనై ఉన్నా మరీ..
అందించవే దీపావళీ

ఎందుకె చెలియా
రెప్పల వలలో వొదిగిన కలలా..
కనుపాపలు వెతికే రేపటి వెలుగును
చూసి చూడవెలా..

నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా..

రోజూ కొత్తగా
నీ సందర్శనం
ఆహా అన్నదీ నాలో స్పందనం
నిత్యం నువ్విలా
నాకై చూడటం
ఎంతో వింతగా
ఉందీ అనుభవం

నడి వేసవిలో మరిగిస్తూనే
మురిపిస్తుందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ
వెన్నెలయిందే ప్రేమగుణం

నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ
నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ..

నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా..

నీతో బంధమే రాసిందెవ్వరో
నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీ వైపుగా లాగిందెవ్వరో
నిన్నే చూడగా ఆపిందెవ్వరో

దరిదాపుల్లో పడిగాపుల్లో
పడినిలిచా నీ రహదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే
కలిసే రేపటి పొద్దుల్లో

నీ చూపులే నా ఊపిరీ..
ఓ సారిలా చూడే చెలీ
అమవాస్యనై ఉన్నా మరీ..
అందించవే దీపావళీ
ఎందుకె చెలియా
రెప్పల వలలో వొదిగిన కలలా..
కనుపాపలు వెతికే రేపటి వెలుగును
చూసి చూడవెలా..

నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా..

nee choopule song lyrics in telugu:

చిత్రం: ఎందుకంటే…ప్రేమంట
పాట: నీ చూపులే నా ఊపిరీ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
గాయకులు: చిత్ర, హరిచరణ్
లేబుల్: ఆదిత్య మ్యూజిక్.

Leave a Comment