మై నేమ్ ఇజు రాజు My Name Iju Raju Song Lyrics in Telugu – Chaavu Kaburu Challaga

My Name Iju Raju Song Lyrics in Telugu Chaavu Kaburu Challaga: sung by Revanth. My Name Iju Raju Song Telugu Lyrics Music of this song is composed by Jakes Bejoy and penned by Karunakar Adigarla. Starring Kartikeya, Lavanya Tripathi. My Name Iju Raju Song Lyrics are here.

MovieChaavu Kaburu Challaga
SongMy name iju raju
SingerRevanth
MusicJakes Bejoy
LyricsKarunakar Adigarla
Music Label Aditya Music

My Name Iju Raju Song Lyrics in Telugu

హే ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా పుట్టావురో
అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగె పోతావురో
ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలే అయిపోతారేందిరో
సత్తే సత్తే సత్తే సత్తే ఏమవుతాదిరో

హే గాల్లో దీపం గుండెల్లో ప్రాణం
ఎప్పుడు తుస్సఅంటుందో ఎవడికి తెలుసును లేరా
ఒంట్లో జీవం కాదె మన సొంతం
ఉన్నన్నాళ్ళు పండగ చేసి పాడెక్కేయిరా
పోయేవాడిని పోనివ్వక నీ ఏడుపు ఎందుకురా
నీ ఆస్తి గీస్తి ఏమైనా ఆడట్టుకపోతాడా
కోటలోని రారాజైన కాటికి పోవాలా
నువ్వు నేను ఎవడైనా కట్టెల్లో కాలాలా

మై నేమ్ ఇజు రాజు బాస్తి బాలరాజు
చావు కబురు చల్లగా చెబుతా ప్రతిరోజు
మై నేమ్ ఇజు రాజు బాస్తి బాలరాజు
చావు కబురు చల్లగా చెబుతా ప్రతిరోజు

హే ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా పుట్టావురో
అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగె పోతావురో
ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలే అయిపోతారేందిరో
సత్తే సత్తే సత్తే సత్తే ఏమవుతాదిరో

చుట్టం చూపుకు వస్తాం పెట్టిందల్లా తింటాం
పర్మనెంటుగా ఆ ఇంట్లోనే బైఠాయించాముగా
సినిమా పోస్టరు చూస్తాం ఓ టికెట్ తీసి వెళతాం
అయిపోయాక కుర్చీ కాళి చెయ్యక తప్పదుగా
ఆరడుగుల బాడీ అంతే అద్దెకు ఉంటున్నామంతే
ఈ బాడీ కొంపని వదిలెయ్యాలి టైమే అయిపోతే

పుట్టేటప్పుడు ఊపేస్తారు నిన్నే ఉయ్యాలా
పోయేటప్పుడు నలుగురు వచ్చి చక్కా మోయాలా
ఉన్నన్నాళ్లు ఆ నలుగురిని సంపాదించాలా
ఊరంతా నిను ఊరేగించి టాటా సెప్పలా

స్వర్గానికి తోలి మెట్టు నా బండేరా ఒట్టు
ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోను కొట్టు
స్వర్గానికి తోలి మెట్టు నా బండేరా ఒట్టు
ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోను కొట్టు

సన్ను డాటారు అవుతాం సిస్టర్ బ్రదరు అంటాం
అందరితోనూ బంధాలెన్నో కలుపుకుపోతుంటాం
అప్పుల్లో మునిగుంటాం అంబానీ కలగంటాం
చిల్లర కోసం ఎన్నో ఎన్నో వేషాలే వేస్తాం
ఈ లైఫ్ ఒక నాటకమేలే మన యాక్టింగులు అయిపోతే
ఈ ఊరు పేరు మేకప్ తీసి చెక్కేయాలంతే

ఆ శివుడాజ్ఞే లేకుండా చీమైనా కుడుతుందా
అంటూ మహాభాగ ఎదంతం సెబుతావంటా
అన్ని ఇచ్చిన ఆ సామే సావుని గిఫ్ట్ ఇవ్వంగా
అయ్యయ్యో ఒద్దంటావెందయ్యో సిత్రంగా

జజ్జనక జజ్జనకా తోడుంటా నీ వెనక
పువ్వులోన మోసుకెళ్లి పూడ్చేస్తా పద కొడకా
జజ్జనక జజ్జనకా తోడుంటా నీ వెనక
పువ్వులోన మోసుకెళ్లి పూడ్చేస్తా పద కొడకా

Related Songs:

My Name Iju Raju Song Video – Chaavu Kaburu Challaga

Leave a Comment