Gundello Emundho Song Lyrics in Telugu

Gundello Emundho Song Lyrics in Telugu
Gundello Emundho Song Lyrics in Telugu

Gundello Emundho Song Lyrics in Telugu, Penned by Sirivennela Sitarama Sastry, Sung by Venu, and Sumangali. Music composed by Devi Sri Prasad from Nagarjuna’s Manmadhudu telugu movie.

Gundello Emundho Song Details

Song TitleGundello Emundho
MovieManmadhudu (2002)
Singer(s)Venu, Sumangali
LyricsSirivennela Sitarama Sastry
MusicDevi Sri Prasad
Music LabelAditya Music

Gundello Emundho Song Lyrics in Telugu

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదుకద హృదయం నువు ఎదురుగ నిలబడితే
కదలదుకద సమయం నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

మనసా.. మనసా.. మనసా.. (3) ఓ మనసా

పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది
నిన్నిలా చూసి పైనుంచి వెన్నెలే చిన్నబోతోంది
కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో ఇదంతా నిజంగా కలలాగేవుంది

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

ఎందుకో తెలియని కంగారుపుడుతున్నది
ఎక్కడా జరగని వింతేమికాదే ఇది
పరిమళం వెంట పయనించే
పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించే
పరిచయం తోడు కోరింది
దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదుకద హృదయం నువు ఎదురుగ నిలబడితే
కదలదుకద సమయం నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది

మనసా.. మనసా.. మనసా.. (3) ఓ మనసా

https://youtu.be/-gzyxCTWRkQ
Gundello Emundho Song Lyrics in Telugu

More Telugu Songs You May Like:

This is a site to get the latest and evergreen popular Hit songs, lyrics were written in Telugu font from Movies and Private album-hit songs. Thanks for visiting us! ఇంకేంటి ఆలస్యం పాడటం స్టార్ట్ చెయ్యండి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here